![]() |
![]() |

బుల్లితెర షోస్ మాములుగా ఉండడం లేదు. మంచి జోష్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కలర్ ఫుల్ గా ముస్తాబై వస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ‘మంచి రోజులొచ్చాయి’ పేరుతో ఓ ఈవెంట్ బుల్లితెర మీద ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ప్రోమో చూస్తే గనక మంచి హీట్ పుట్టించే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు విష్ణుప్రియ, మానస్. విష్ణుప్రియ ‘పోరాపోవే’ షోతో యాంకర్ గా మారింది. తర్వాత ‘ వాంటెడ్ పండుగాడ్’ అనే మూవీలో ఓ హీరోయిన్ గా చేసింది.
రీసెంట్ గా ‘జరీ జరీ పంచె కట్టి’ అంటూ బిగ్ బాస్ మానస్ తో కలిసి విష్ణుప్రియ ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేసింది. అది సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. దీంతో విష్ణుప్రియ-మానస్ జంటను మెయిన్ కాన్సెప్ట్ గా సెలెక్ట్ చేసుకుని సంక్రాంతి షో ప్లాన్ చేశారు మేకర్స్. వీళ్లకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాక స్టేజి మీదకు విష్ణుప్రియ తరఫు బంధువులు, మానస్ తరఫు బంధువులు రావడం వాళ్ళ పెళ్లి కోసం జరిగే హంగామా మొత్తాన్ని చూపించబోతున్నారు. ఇక వీళ్ళిద్దరూ ‘ఈ వర్షం సాక్షిగా’ అనే పాటకు చేసిన డాన్స్ లో వీళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.
ఈ సాంగ్ ఐపోయాక అర్జున్ అంబటి వచ్చి "పెళ్ళికి ముందే ఇంత చేశారు అంటే ఇక పెళ్లి తర్వాత ఎంత చేస్తారో ఊహించుకుంటే ఆ" అని నవ్వుతాడు. తర్వాత అన్నపూర్ణ, సుధా, రజిత వచ్చి "ఆది ఇక నుంచి జబర్దస్త్ కి ఇక నుంచి మేమే టీం లీడర్స్ అని కామెడీగా చెప్పేసరికి "ఇంతకు మీ టీం పేరేంటి" అని ఆది అడిగాడు. "అదరగొట్టే అన్నపూర్ణ, సూపర్ సుధా, రైజింగ్ రజిత" అనే చెప్పేసరికి "అవి అస్సలు మీకు సెట్ కాలేదు..అల్సర్ అన్నపూర్ణ, షుగర్ సుధా, రక్తపోటు రజిత" అనేవైతే సెట్ అవుతాయి అనేసరికి అందరూ నవ్వేశారు.
![]() |
![]() |